Breaking News

ఏపీలో కొత్తగా 100 పడకల ESI ఆసుపత్రి..


Published on: 09 Dec 2025 12:30  IST

నెల్లూరు నగరంలో 100 పడకల ఉద్యోగుల రాష్ట్ర బీమా (ESI) ఆసుపత్రిని నిర్మించడానికి చర్యలు ప్రారంభమవుతున్నాయని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. సోమవారం లోక్‌సభలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.శ్రీ సిటీలో ప్రతిపాదిత 100 పడకల ESI ఆసుపత్రి కోసం సిబ్బంది క్వార్టర్లకు స్థలంతో సహా ఐదు ఎకరాల భూమిని ఇప్పటికే సేకరించామని ఆమె వివరించారు.

Follow us on , &

ఇవీ చదవండి