Breaking News

తిరుపతిలో ఈట్‌ స్ట్రీట్‌..త్వరలో అందుబాటులోకి..


Published on: 09 Dec 2025 14:22  IST

తిరుపతిలో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈట్‌ స్ట్రీట్‌ (ఫుడ్‌ కోర్ట్‌)కు వేగంగా అడుగులు పడుతోంది. ప్రస్తుత నగరపాలక సంస్థ కార్యాలయానికి ఎదురుగా ఉన్న అచ్యుత దేవరాయలు మార్గంలో ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 40 నుంచి 50 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. 8/16 సైజుగల 12 కంటైనర్లను స్టాళ్లుగా మార్చ నున్నారు. మిగిలినవి నిర్దేశించిన ఖాళీ స్థలాన్ని స్టాళ్లుగా మార్చుకునేందుకు టెండరుదారుకు కేటాయించనున్నారు. రెండు నెలల్లో  అందుబాటులోకి తీసుకు రానున్నట్టు కార్పొరేషన్‌ వర్గాలు చెబుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి