Breaking News

అనంత్ అంబానీకి 'గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు ఈ అవార్డును అందుకున్న అతి పిన్న వయస్కుడు ,మొదటి ఆసియా వ్యక్తిగా నిలిచారు

అనంత్ అంబానీకి (Anant Ambani) 'గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు ఫర్ యానిమల్ వెల్ఫేర్' (Global Humanitarian Award for Animal Welfare) లభించింది. అమెరికాకు చెందిన గ్లోబల్ హ్యూమన్ సొసైటీ ఈ అవార్డును ప్రదానం చేసింది. 

Published on: 09 Dec 2025 15:31  IST

అనంత్ అంబానీకి (Anant Ambani) 'గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు ఫర్ యానిమల్ వెల్ఫేర్' (Global Humanitarian Award for Animal Welfare) లభించింది. అమెరికాకు చెందిన గ్లోబల్ హ్యూమన్ సొసైటీ ఈ అవార్డును ప్రదానం చేసింది. 

అనంత్ అంబానీ, 'వంతారా' (Vantara) వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ సెంటర్ వ్యవస్థాపకుడు.వన్యప్రాణుల సంరక్షణ, జంతు సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషికి ఈ అంతర్జాతీయ పురస్కారం లభించింది.అనంత్ అంబానీ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న అతి పిన్న వయస్కుడు మరియు మొదటి ఆసియా వ్యక్తిగా నిలిచారు.అమెరికాలోని వాషింగ్టన్ DCలో జరిగిన అంతర్జాతీయ కార్యక్రమంలో ఈ అవార్డును అందించారు.గతంలో ఈ అవార్డును జాన్ ఎఫ్ కెన్నెడీ, బిల్ క్లింటన్ వంటి మాజీ అమెరికా అధ్యక్షులు, హాలీవుడ్ ప్రముఖులు అందుకున్నారు. అనంత్ అంబానీ మాట్లాడుతూ, ఈ గౌరవం 'సర్వభూత హిత' అనే భారతీయ సూత్రాన్ని గుర్తు చేస్తుందని, వన్యప్రాణులకు గౌరవం, సంరక్షణ అందించడమే 'వంతారా' లక్ష్యమని పేర్కొన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి