Breaking News

పోలింగ్‌ను బహిష్కరించిన గ్రామస్తులు


Published on: 11 Dec 2025 12:34  IST

జిల్లాలోని రామారెడ్డి మండలం చిన్న గోకుల్ తండా వాసులు ఎన్నికలను బహిష్కరించారు.తమకు సమాచారం ఇవ్వకుండా పెద్దగోకుల్ తండా వాసులు సర్పంచ్‌ ను ఏకగ్రీవం చేసుకున్నారని గ్రామస్తులు నిరసనకు దిగారు. పెద్ద గోకుల్ తండా వాసిని వేలం పాట ద్వారా ఏకగ్రీవం చేసుకున్నారని చిన్న గోకుల్ తండా వాసులు ఆరోపిస్తున్నారు. ఇందుకు నిరసనగా చిన్నగోకుల్ తండా వాసులు ఓట్లు వేయకుండా తండాల్లోనే ఉండిపోయారు.తమకు ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి