Breaking News

భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్వదేశీ హైడ్రోజన్ ఇంధన సెల్ ప్యాసింజర్ నౌక వారణాసిలోని నమో ఘాట్‌లోప్రారంభం

భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్వదేశీ హైడ్రోజన్ ఇంధన సెల్ ప్యాసింజర్ నౌక commercial operations వారణాసిలోని నమో ఘాట్‌లో డిసెంబర్ 11, 2025న ప్రారంభమయ్యాయి.


Published on: 12 Dec 2025 11:34  IST

భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్వదేశీ హైడ్రోజన్ ఇంధన సెల్ ప్యాసింజర్ నౌక commercial operations వారణాసిలోని నమో ఘాట్‌లో డిసెంబర్ 11, 2025న ప్రారంభమయ్యాయి. కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈ సేవలను జెండా ఊపి ప్రారంభించారు. 

ఈ నౌకను కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించింది.ఇది హైబ్రిడ్ ఎలక్ట్రిక్-హైడ్రోజన్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. లో-టెంపరేచర్ ప్రోటాన్ ఎక్స్ఛేంజ్ మెమ్బ్రేన్ (LT-PEM) ఫ్యూయల్ సెల్ సిస్టమ్‌ను ఉపయోగించి హైడ్రోజన్‌ను విద్యుత్తుగా మారుస్తుంది. ఈ ప్రక్రియలో నీరు మాత్రమే ఉప ఉత్పత్తిగా విడుదల అవుతుంది, ఎటువంటి వాయు కాలుష్యం ఉండదు.ఈ 24 మీటర్ల క్యాటమరాన్ నౌకలో 50 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉంది.ఇది వారణాసిలోని నమో ఘాట్ మరియు రవిదాస్ ఘాట్ల మధ్య వాటర్ ట్యాక్సీ సేవలను అందిస్తుంది. పర్యాటకులు మరియు యాత్రికులకు శబ్దం మరియు కాలుష్య రహిత ప్రయాణ అనుభూతిని అందిస్తుంది.

'మేక్ ఇన్ ఇండియా' మరియు 'గ్రీన్ మొబిలిటీ' లక్ష్యాలకు అనుగుణంగా, దేశంలోని అంతర్గత జలమార్గాలలో స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా వ్యవస్థల వైపు భారత్ వేసిన ఒక పెద్ద ముందడుగు ఇది.

 

Follow us on , &

ఇవీ చదవండి