Breaking News

సిట్ ముందు లొంగిపోయిన ప్రభాకర్ రావు


Published on: 12 Dec 2025 14:59  IST

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ ముందు లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈరోజు (శుక్రవారం) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దర్యాప్తు అధికారి ఏసీపీ వెంకటగిరి ముందు ప్రభాకర్‌రావు సరెండర్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రభాకర్ రావును సిట్ అధికారులు ఆరు సార్లు విచారణ జరిపిన విషయం తెలిసిందే. అయితే సిట్ విచారణకు ప్రభాకర్ సహకరించకపోవడంతో కస్టోడియల్ విచారణకు ఇవ్వాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించింది.

Follow us on , &

ఇవీ చదవండి