Breaking News

హామీలు తప్ప ప్రభుత్వం నెరవేర్చిందేమీ లేదు..


Published on: 12 Dec 2025 15:08  IST

నగరంలోని మలక్‌పేట, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో గురువారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) జాగృతి జనంబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సైదాబాద్‌లో స్టీల్‌బ్రిడ్జి పనులను పరిశీలించి ఐదేళ్లుగా నిర్మాణం జరుగుతున్నా ఇంకా పూర్తి కాకపోవడం దారుణమన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలు ఇవ్వడమే తప్ప నెరవేర్చిందేమీ లేదని విమర్శించారు.

Follow us on , &

ఇవీ చదవండి