Breaking News

కేబినెట్ హోదాలపై పిల్‌.. హైకోర్టు కీలక ఆదేశాలు


Published on: 12 Dec 2025 15:21  IST

కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో సహా కొందరికీ కేబినెట్ హోదా కల్పిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం జీవో ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత ఏరోళ్ల శ్రీనివాస్ తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిల్‌పై  శుక్రవారం  విచారణ జరిగింది.కాంగ్రెస్ నేతలు కేశవరావు , పోచారం శ్రీనివాసరెడ్డి , సుదర్శన్ రెడ్డి, ప్రేమ్‌సాగర్, చిన్నారెడ్డిలతోపాటు మరో తొమ్మిది మందికి కేబినెట్ హోదా చట్ట విరుద్ధమని పిటిషన్‌లో ప్రస్తావించారు.

Follow us on , &

ఇవీ చదవండి