Breaking News

తెలంగాణ పెరిగిన చలి పలుజిల్లాలకు హెచ్చరికలు

తెలంగాణలో చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో, భారత వాతావరణ శాఖ (IMD) డిసెంబర్ 12 మరియు 13, 2025 తేదీలలో పలు జిల్లాలకు పసుపు రంగు (ఎల్లో) హెచ్చరికలు జారీ చేసింది.


Published on: 12 Dec 2025 17:27  IST

తెలంగాణలో చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో, భారత వాతావరణ శాఖ (IMD) డిసెంబర్ 12 మరియు 13, 2025 తేదీలలో పలు జిల్లాలకు పసుపు రంగు (ఎల్లో) హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. IMD హెచ్చరిక జారీ చేసిన జిల్లాల ఆదిలాబాద్ , కుమురం భీమ్ ఆసిఫాబాద్ ,మంచిర్యాల , నిర్మల్ , వరంగల్ , హనుమకొండ , మహబూబాబాద్ , జనగాం , సిద్దిపేట, సంగారెడ్డి , మెదక్ ,కామారెడ్డి హైదరాబాద్‌లోని శివారు ప్రాంతాలలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయే అవకాశం ఉంది. 

తీసుకోవలసిన జాగ్రత్తలు :

చలిగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు. 

వీలైనంత వరకు ఇంటి లోపలే ఉండండి, ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లడం తగ్గించండి.

తగినన్ని ఉన్ని దుస్తులు, ముఖ్యంగా చేతులు, కాళ్లు, తల మరియు మెడ భాగాలు కప్పి ఉంచేలా ధరించండి.

శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి క్రమం తప్పకుండా వేడి పానీయాలు తాగండి.

వృద్ధులు, పిల్లలు మరియు అనారోగ్యంతో ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి, వారికి తగిన ఆశ్రయం ఉండేలా చూసుకోండి.

స్థానిక వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు IMD వెబ్‌సైట్ లేదా వార్తల ద్వారా

ఆల్కహాల్ సేవించడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది కాబట్టి, చలికాలంలో దానికి దూరంగా ఉండటం మంచిది. 

Follow us on , &

ఇవీ చదవండి