Breaking News

సీతారామపురంలో ఉద్రిక్తత..


Published on: 15 Dec 2025 18:49  IST

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల హడవుడి నడుస్తుంది. సూర్యాపేట జిల్లా ( Suryapet District) చిలుకూరు మండలం.. సీతారామపురం గ్రామంలో ఎన్నికల అధికారి (RO) నాగరాజు (Nagaraju)ను గ్రామస్థులు ఓ గదిలో బంధించారు. ఎన్నికల అధికారి ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని.. ఉపసర్పంచ్ (Deputy Sarpanch) పదవిని ముందుగానే ప్రకటించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.నాగరాజు వ్యవహారంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన్ని గదిలో బంధించారు.

Follow us on , &

ఇవీ చదవండి