Breaking News

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం..


Published on: 16 Dec 2025 11:13  IST

ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. మధుర లోని ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ రహదారి పై మంగళవారం తెల్లవారుజామున నాలుగు బస్సుల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, సుమారు 30 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.పొగ మంచు కారణంగా ఒకేసారి 7 బస్సులు, 3 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.దీంతో మంటలు చెలరేగాయి. ఏకకాలంలో మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి