Breaking News

పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..


Published on: 16 Dec 2025 11:17  IST

తెలంగాణ రాష్ట్రంలో సామాజిక భద్రత పింఛన్ల పెంపును త్వరలోనే అమలులోకి తీసుకురావాలన్న దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఆరు గ్యారంటీల్లో ఒకటైన పింఛన్ల పెంపును వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు సహా ఇతర పింఛన్ల పెంపుపై సాధ్యాసాధ్యాలను అధికారులు సమీక్షిస్తున్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి, అంటే ఏప్రిల్ నుంచే పింఛన్ల పెంపు అమలుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి