Breaking News

యువతి పేరుపై వరుసగా ఆరు ఓట్లు


Published on: 16 Dec 2025 14:25  IST

సాధారణంగా ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉంటుంది. కానీ ఓ యువతి పేరుపై ఒకే ఊరు, ఒకే వార్డులో ఏకంగా ఆరు ఓట్లు ఉన్నాయి. అది కూడా గ్రామ ఓటరు జాబితాలో వరుసగా ఒకే ఫొటోతో ఉన్నాయి. నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలంలోని మంథన్‌గోడ్‌ గ్రామంలో ఈ విచిత్రం చోటు చేసుకుంది. ఓటరు జాబితాలో అయిదు చోట్ల ఆమె పేరు చిన్న చిన్న మార్పులతో ఉండగా, మరో చోట మాత్రం వేరే పేరుతో ఉంది. అధికారులు ఈ విషయాన్ని గుర్తించకపోవడం గమనార్హం.

Follow us on , &

ఇవీ చదవండి