Breaking News

చనిపోయాడనే సానుభూతితో...


Published on: 16 Dec 2025 14:27  IST

నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురంలో ఓటమిపాలైన సర్పంచ్‌ అభ్యర్థి గుండెపోటుతో మృతిచెందగా, ఎస్సీ కాలనీవాసులు సహృదయతతో వ్యవహరించారు. ఆ అభ్యర్థి పంపిణీచేసిన నగదును అందరినుంచి వసూలుచేసి ఇంట్లోవారికి అందజేశారు. గ్రామానికి చెందిన చెనగోని కాటంరాజు (49) బీఆర్‌ఎస్‌ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేశారు. ఎన్నికల సందర్భంగా సుమారు రూ.25లక్షలు ఆయన ఖర్చు చేసినట్లు తెలిసింది. 11న జరిగిన ఎన్నికల్లో కాటంరాజు 143 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

Follow us on , &

ఇవీ చదవండి