Breaking News

ఉద్రిక్తతలు తొలిగేందుకు నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాం: చైనా


Published on: 10 May 2025 17:26  IST

భారత్‌- పాకిస్థాన్‌ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితులను మేం నిశితంగా గమనిస్తున్నాం. శాంతి, స్థిరత్వం కోసం ఇరుదేశాలు సమయమనం పాటించాలని కోరుతున్నాం. ఉద్రిక్తతలను తీవ్రతరం చేసే చర్యలను తగ్గించుకోవాలని సూచిస్తున్నాం. ఈ ఉద్రిక్తతలను తగ్గించాలని అంతర్జాతీయ సమాజం కూడా ఆశిస్తోంది. ఈ సమస్య ముగింపునకు అవసరమైతే నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని చైనా విదేశాంగ శాఖ శనివారం ఒక ప్రకటనలో సూచించింది.

Follow us on , &

ఇవీ చదవండి