Breaking News

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టులు ఒకేసారి లొంగిపోయారు

డిసెంబర్ 19, 2025న హైదరాబాద్‌లో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టులు ఒకేసారి లొంగిపోయారు. మావోయిస్టు పార్టీకి ఇది భారీ ఎదురుదెబ్బగా పరిగణించబడుతోంది. 


Published on: 19 Dec 2025 16:47  IST

డిసెంబర్ 19, 2025న హైదరాబాద్‌లో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టులు ఒకేసారి లొంగిపోయారు. మావోయిస్టు పార్టీకి ఇది భారీ ఎదురుదెబ్బగా పరిగణించబడుతోంది. 

లొంగిపోయిన వారిలో కామారెడ్డి జిల్లాకు చెందిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి, ఒడిశా మరియు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆరుగురు డివిజన్ కమిటీ సభ్యులు ఉన్నారు.వీరిలో ఇద్దరు సెంట్రల్ విజన్ కమాండర్లు కూడా ఉన్నారు. లొంగిపోయిన వారిలో అధికశాతం మంది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారు కాగా, ఇద్దరు తెలంగాణ వాసులు ఉన్నారు.లొంగుబాటు సమయంలో మావోయిస్టుల నుంచి 24 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస కార్యక్రమాలు మరియు పోలీసుల ఒత్తిడి కారణంగానే వీరు జనజీవన స్రవంతిలో కలిసేందుకు మొగ్గు చూపారని డీజీపీ తెలిపారు. నవంబర్ 2025లో కూడా సుమారు 37 మంది మావోయిస్టులు ఇదే తరహాలో లొంగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా 41 మంది లొంగుబాటుతో ఈ ఏడాది మొత్తం లొంగిపోయిన మావోయిస్టుల సంఖ్య మరింత పెరిగింది. 

Follow us on , &

ఇవీ చదవండి