Breaking News

చెత్తకుప్పలో దొరికిన వస్తువును ఆటబొమ్మ అనుకుని ఆడుకుంటుండగా, పోలీసులు దానిని చైనా నిర్మిత రైఫిల్ స్కోప్గా గుర్తించారు.

జమ్మూలోని సిధ్రా పరిధిలో ఉన్న అస్రారాబాద్ గ్రామంలో 2025 డిసెంబర్ 22న ఆరేళ్ల బాలుడు ఒక చెత్తకుప్పలో దొరికిన వస్తువును ఆటబొమ్మ అనుకుని ఆడుకుంటుండగా, పోలీసులు దానిని చైనా నిర్మిత రైఫిల్ స్కోప్ (Telescope) గా గుర్తించారు.

Published on: 22 Dec 2025 11:46  IST

జమ్మూలోని సిధ్రా పరిధిలో ఉన్న అస్రారాబాద్ గ్రామంలో 2025 డిసెంబర్ 22న ఆరేళ్ల బాలుడు ఒక చెత్తకుప్పలో దొరికిన వస్తువును ఆటబొమ్మ అనుకుని ఆడుకుంటుండగా, పోలీసులు దానిని చైనా నిర్మిత రైఫిల్ స్కోప్ (Telescope) గా గుర్తించారు.

ఇది అసాల్ట్ రైఫిల్స్ లేదా స్నిపర్ రైఫిల్స్‌కు అమర్చి లక్ష్యాలను ఖచ్చితంగా చేధించడానికి ఉపయోగించే టెలిస్కోప్ అని ప్రాథమిక విచారణలో తేలింది.ఈ వస్తువు లభించిన ప్రాంతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉండటంతో పోలీసులు ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు.

స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) బృందాలు ఆ ప్రాంతమంతా విస్తృతంగా సోదాలు చేపట్టాయి. ప్రజలు ఆందోళన చెందవద్దని పోలీసులు సూచించారు.దీనికి సంబంధించి సాంబా జిల్లాలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి