Breaking News

గచ్చిబౌలి ఐటీ కారిడార్‌కు నేరుగా ఆర్టీసీ కొత్త బస్సు సేవలు

గచ్చిబౌలి ఐటీ కారిడార్‌కు నేరుగా ఆర్టీసీ కొత్త బస్సు సేవలు


Published on: 23 Dec 2025 10:24  IST

హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు రోజూ ఎదుర్కొనే ప్రయాణ కష్టాలకు ఆర్టీసీ పరిష్కారం చూపింది. హయత్‌నగర్‌, ఎల్‌బీ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల నుంచి గచ్చిబౌలి ఐటీ కారిడార్‌కు నేరుగా చేరుకునేలా రెండు కొత్త బస్సు మార్గాలను ప్రవేశపెట్టింది. ఇకపై మెట్రో, క్యాబ్‌లు మారుస్తూ ప్రయాణించే అవసరం లేకుండా, ఒక్క బస్సులోనే కార్యాలయాలకు చేరుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.

గర్‌లక్ష్మీ ఇన్ఫోబాన్’ పేరుతో ప్రారంభించిన ఈ సేవలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11.50 గంటల వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. సోమవారం నుంచి 156/316, 300/316 రూట్‌లలో ఈ బస్సులు గచ్చిబౌలి వైపు పరుగులు పెడుతున్నాయి. ఈ కొత్త సర్వీసులతో నగరంలోని దాదాపు 40 ప్రాంతాల ప్రజలకు ప్రయాణ సౌలభ్యం కలిగినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ఐటీ కారిడార్‌పై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి

ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగుల సమయ విలువను దృష్టిలో పెట్టుకుని ఈ మార్గాలను ప్రత్యేకంగా రూపొందించినట్లు ఆర్టీసీ వెల్లడించింది. ట్రాఫిక్‌ సమస్యలు తగ్గేలా, వేగంగా గమ్యం చేరేలా రూట్‌లను ఎంపిక చేసింది.

156/316 రూట్
ఈ బస్సు ఎల్‌బీ నగర్ నుంచి కోఠి, మెహిదీపట్నం, లంగర్‌హౌజ్, నార్సింగి, కోకాపేట క్రాస్‌రోడ్, గర్, కాంటినెంటల్ సర్కిల్, ఐసీఐసీఐ సర్కిల్, ఐఐఐటీ మీదుగా గచ్చిబౌలికి చేరుతుంది.

300/316 రూట్
హయత్‌నగర్ నుంచి ఎల్‌బీ నగర్, సాగర్ క్రాస్‌రోడ్, బండ్లగూడ, మైలార్‌దేవ్‌పల్లి, ఆరాంఘర్, ఉప్పర్‌పల్లి, లంగర్‌హౌజ్, తారామతి, నార్సింగి, కోకాపేట సర్కిల్, గర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, వేవ్‌రాక్, ఐసీఐసీఐ జంక్షన్, విప్రో సర్కిల్, ఇన్ఫోసిస్, ఐఐఐటీ మీదుగా గచ్చిబౌలి చేరుకునేలా ఈ రూట్ రూపొందించారు.

సమయం ఆదా… ప్రయాణం సులువు

కొత్త బస్సు సేవలతో ఐటీ ఉద్యోగులకు సమయం ఆదా అవుతుందని, ప్రయాణ ఒత్తిడి తగ్గుతుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్‌లో ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయని భావిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి