Breaking News

దిల్లీలో బంగ్లా హైకమిషన్ వద్ద ఉద్రిక్తత


Published on: 23 Dec 2025 16:01  IST

దేశ రాజధాని దిల్లీలోని బంగ్లాదేశ్‌ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది (Bangladesh High Commission). బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండిస్తూ కార్యాలయం వద్దకు వీహెచ్‌పీ కార్యకర్తలు భారీగా చేరుకొని నిరసన చేపట్టారు. బారీకేడ్లు నెట్టుకొని లోపలికి వెళ్లేందుకు యత్నించారు. దాంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. కార్యకర్తలు ఎవరూ లోపలికి వెళ్లకుండా నిలువరిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి