Breaking News

హయత్‌నగర్‌లో స్థానికుల ఆందోళన


Published on: 23 Dec 2025 16:14  IST

నగరంలోని హయత్‌నగర్‌లో జాతీయ రహదారిపై స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని.. పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ఫుట్ ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు.హయత్‌నగర్‌ కార్పొరేటర్‌ నవజీవన్‌రెడ్డి, మన్సూరాబాద్‌ కార్పొరేటర్‌ నరసింహారెడ్డితో పాటు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న కాలనీ వాసులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి