Breaking News

అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారుల కోసం 3,000 డాలర్ల ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించింది

అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారుల కోసం ఈ ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించింది. స్వచ్ఛందంగా తమ దేశాలకు తిరిగి వెళ్లడానికి (Self-Deportation) సిద్ధంగా ఉన్న అక్రమ వలసదారులకు అమెరికా ప్రభుత్వం 3,000 డాలర్లు (దాదాపు ₹2.5 లక్షలు) నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తోంది.

Published on: 23 Dec 2025 19:02  IST

అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారుల కోసం ఈ ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించింది. స్వచ్ఛందంగా తమ దేశాలకు తిరిగి వెళ్లడానికి (Self-Deportation) సిద్ధంగా ఉన్న అక్రమ వలసదారులకు అమెరికా ప్రభుత్వం 3,000 డాలర్లు (దాదాపు ₹2.5 లక్షలు) నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తోంది.

నగదుతో పాటు, వారికి తమ స్వదేశాలకు వెళ్లడానికి ఉచిత విమాన టిక్కెట్లు కూడా ప్రభుత్వం సమకూరుస్తుంది. అలాగే, గతంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు విధించిన జరిమానాలను కూడా రద్దు చేస్తారు.

ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ 31, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఆసక్తి ఉన్నవారు "CBP Home" అనే మొబైల్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి, నిర్బంధించి, బలవంతంగా దేశం వెలుపలికి పంపడానికి ప్రభుత్వానికి సగటున 17,000 డాలర్లు ఖర్చవుతుంది. ఈ ఖర్చును తగ్గించుకోవడానికి ట్రంప్ ప్రభుత్వం ఈ "ఎగ్జిట్ బోనస్" పథకాన్ని ప్రవేశపెట్టింది.

ఈ గడువులోపు స్వచ్ఛందంగా వెళ్లని వారిని గుర్తించి, అరెస్ట్ చేసి బలవంతంగా బహిష్కరిస్తామని, ఆ తర్వాత వారు ఎప్పటికీ అమెరికాలోకి ప్రవేశించలేరని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ హెచ్చరించారు.

Follow us on , &

ఇవీ చదవండి