Breaking News

కేరళ వర్కల సమీపంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కుపెను ప్రమాదం తప్పింది.

కేరళలోని తిరువనంతపురం జిల్లా వర్కల సమీపంలో డిసెంబర్ 23, 2025 మంగళవారం రాత్రి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు (రైలు నెం. 20633) పెను ప్రమాదం తప్పింది.


Published on: 24 Dec 2025 14:03  IST

కేరళలోని తిరువనంతపురం జిల్లా వర్కల సమీపంలో డిసెంబర్ 23, 2025 మంగళవారం రాత్రి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు (రైలు నెం. 20633) పెను ప్రమాదం తప్పింది.

కాసరగోడ్ నుండి తిరువనంతపురం వెళ్తున్న వందే భారత్ రైలు అకత్తుమురి హాల్ట్ స్టేషన్ సమీపంలో పట్టాలపై నిలిచి ఉన్న ఒక ఆటోరిక్షాను ఢీకొట్టింది.రైలు పట్టాలపై ఆటో ఉండటాన్ని గమనించిన లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయినప్పటికీ, రైలు ఆటోను కొంతదూరం ఈడ్చుకుంటూ వెళ్లింది.

ఈ ఘటనలో రైలు ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు, అందరూ సురక్షితంగా ఉన్నారు.ఆటో డ్రైవర్ సుధి మద్యం మత్తులో ఆటోను ప్లాట్‌ఫారమ్ నుండి పట్టాలపైకి నడిపినట్లు పోలీసులు గుర్తించారు. రైలు వస్తుండటాన్ని గమనించి అతను వాహనం నుండి దూకేయడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతను పోలీస్ కస్టడీలో ఉన్నాడు.ఈ ప్రమాదం కారణంగా పట్టాలపై శిథిలాలను తొలగించి, భద్రతా తనిఖీలు పూర్తయ్యే వరకు రైలు సుమారు ఒక గంటకు పైగా నిలిచిపోయింది. రాత్రి 11:15 గంటలకు తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించి, 11:50 గంటలకు తిరువనంతపురం చేరుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి