Breaking News

ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి..


Published on: 26 Dec 2025 11:16  IST

ఆళ్లగడ్డ మండలం నల్లగట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ట్రావెల్స్‌ బస్సు ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో వేగంగా దూసుకెళ్లిన కారు.. డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. దీంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మృతులంతా హైదరాబాద్ వాసులుగా తెలుస్తోంది. మృతిచెందిన వారిని గుండురావు(60), శ్రావణ్ (22), నరసింహ, బన్నీగా గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి