Breaking News

చివ్వెంలో విద్యుదాఘాతంతో తండ్రీకొడుకుల మృతి

సూర్యాపేట జిల్లా చివ్వెంలలో విద్యుదాఘాతంతో తండ్రీకొడుకులు మృతి చెందిన విషాదకర ఘటన 2025 డిసెంబర్ 25న (గురువారం సాయంత్రం) చోటుచేసుకుంది.


Published on: 26 Dec 2025 16:15  IST

సూర్యాపేట జిల్లా చివ్వెంలలో విద్యుదాఘాతంతో తండ్రీకొడుకులు మృతి చెందిన విషాదకర ఘటన 2025 డిసెంబర్ 25న (గురువారం సాయంత్రం) చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా, చివ్వెంల మండల కేంద్రంలోని 7జీ కాలనీ మాదాసు బుచ్చయ్య (48) మరియు అతని చిన్న కుమారుడు మాదాసు లోకేష్ (22).

బుచ్చయ్య తన కొత్త ఇంటి నిర్మాణంలో భాగంగా పిల్లర్లకు నీళ్లు కొట్టేందుకు ట్రాక్టర్ ట్యాంకర్‌లోని మోటార్ ఆన్ చేశాడు. ఈ క్రమంలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో బుచ్చయ్య షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.తండ్రి పడిపోవడాన్ని గమనించిన కుమారుడు లోకేష్, అతడిని రక్షించే ప్రయత్నంలో ట్యాంకర్‌ను తాకడంతో అతను కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు.

స్థానికులు వారిద్దరినీ వెంటనే సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా, వారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులు మరణించడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Follow us on , &

ఇవీ చదవండి