Breaking News

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ శివారులోని తమ్మిలేరు వంతెన సమీపంలో డిసెంబర్ 28, 2025 ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక లారీ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.


Published on: 29 Dec 2025 10:33  IST

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ శివారులోని తమ్మిలేరు వంతెన సమీపంలో డిసెంబర్ 28, 2025 ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక లారీ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.ఈ ఘోర ప్రమాదంలో అక్కా తమ్ముళ్లు ఇద్దరు తేజస్విని (21) మరియు పుచ్చ దేవేందర్ (14) అక్కడికక్కడే మృతి చెందారు. వీరు పెనుబల్లి మండలం సూర్య బంజర్ తండాకు చెందిన వారు.

మోటార్ సైకిల్ నడుపుతున్న తేజస్విని భర్త తోట మధుకు తీవ్ర గాయాలయ్యాయి. అతనికి తొలుత సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు.క్రిస్మస్ సెలవుల కోసం ఇంటికి వచ్చిన తమ్ముడిని, తల్లిదండ్రులను చూసేందుకు తేజస్విని, ఆమె భర్త వెళ్లారు. తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.సత్తుపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి