Breaking News

'మన్‌ కీ బాత్' ప్రసంగంలో 2025 సంవత్సరంలో భారతదేశం సాధించిన అద్భుత విజయాలను కొనియాడిన మోడీ

ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 28, 2025న నిర్వహించిన ఈ ఏడాది చివరి 'మన్‌ కీ బాత్' (129వ ఎపిసోడ్) ప్రసంగంలో 2025 సంవత్సరంలో భారతదేశం సాధించిన అద్భుత విజయాలను కొనియాడారు. 


Published on: 29 Dec 2025 11:56  IST

ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 28, 2025న నిర్వహించిన ఈ ఏడాది చివరి 'మన్కీ బాత్' (129వ ఎపిసోడ్) ప్రసంగంలో 2025 సంవత్సరంలో భారతదేశం సాధించిన అద్భుత విజయాలను కొనియాడారు. 

క్రీడలు మరియు అంతరిక్ష రంగాల్లో భారతదేశం సాధించిన ప్రగతిపై ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి.

ఆటల్లో గెలిచాం :

క్రికెట్: భారత పురుషుల జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోగా, మహిళల క్రికెట్ జట్టు మొదటిసారి ప్రపంచ కప్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది.

బ్లైండ్ క్రికెట్: భారత మహిళల బ్లైండ్ టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచారు.

ఆసియా కప్: ఆసియా కప్ టీ20లోనూ భారత త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరిందని ప్రధాని పేర్కొన్నారు.

పారా-అథ్లెట్లు: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత పారా-అథ్లెట్లు అసాధారణ ప్రతిభ కనబరిచి అనేక పతకాలు సాధించారు. 

అంతరిక్షంలో మెరిశాం :

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS): గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు.

అంతరిక్ష శక్తిగా భారత్: 2025లో భారత్ కేవలం రాకెట్లను ప్రయోగించే దేశంగా మాత్రమే కాకుండా, ఒక సమగ్ర అంతరిక్ష శక్తిగా (Space Power) ఎదిగిందని మోదీ ప్రశంసించారు. 

ఆపరేషన్ సిందూర్: జాతీయ భద్రత విషయంలో భారత్ రాజీ పడదని నిరూపించిన 'ఆపరేషన్ సిందూర్' ప్రతి భారతీయుడికి గర్వకారణంగా నిలిచిందని ప్రధాని తెలిపారు.

యువశక్తి: ప్రపంచం మొత్తం భారతదేశం వైపు ఆశగా చూడటానికి ప్రధాన కారణం మన దేశ యువశక్తి అని ఆయన అభివర్ణించారు. 

 

Follow us on , &

ఇవీ చదవండి