Breaking News

రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

డిసెంబర్ 29, 2025న హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్‌చాట్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. 


Published on: 29 Dec 2025 14:17  IST

డిసెంబర్ 29, 2025న హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్‌చాట్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

రేవంత్ రెడ్డి చేస్తున్న అవినీతిని, దోపిడీని తాము అడుగడుగునా అడ్డుకుంటున్నందుకే ఆయన తనపై అసహనంతో దూషణలకు దిగుతున్నారని, ఆ తిట్లను తాను దీవెనలుగా భావిస్తానని కేటీఆర్ పేర్కొన్నారు.తనను తిడితే పడతాను కానీ, తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్‌ను తిడితే మాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

కేసీఆర్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న భయంతోనే రేవంత్ ప్రభుత్వం 'పాలమూరు-రంగారెడ్డి' పనులను ముందుకు సాగనీయడం లేదని, గతంలో పిలిచిన టెండర్లను కూడా రద్దు చేశారని ఆరోపించారు.తనను రాజకీయంగా ఎదుర్కోలేక, రాబోయే మున్సిపల్ ఎన్నికల నాటికి తనను లేకుండా చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నీటిపారుదల అంశాలపై ముఖ్యమంత్రికి కనీస అవగాహన లేదని, అసెంబ్లీలో చర్చించడానికి సబ్జెక్ట్ లేనప్పుడే ఇలాంటి బూతులు మాట్లాడుతుంటారని విమర్శించారు.రేవంత్ రెడ్డి భాష ముఖ్యమంత్రి పదవికి తగదని, కేవలం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక పోతున్నారనే ఫ్రస్ట్రేషన్‌లోనే ఆయన ఇలా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Follow us on , &

ఇవీ చదవండి