Breaking News

విశాఖ పోర్ట్ చైర్‌పర్సన్‌గా తొలి మహిళా IAS

విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (VPA) డిప్యూటీ చైర్‌పర్సన్‌గా తొలి మహిళా IAS అధికారిణి నియమితులయ్యారు.


Published on: 29 Dec 2025 17:59  IST

విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (VPA) డిప్యూటీ చైర్‌పర్సన్‌గా తొలి మహిళా IAS అధికారిణి నియమితులయ్యారు.శ్రీమతి కౌశల్ బాటియా, IAS విశాఖపట్నం పోర్ట్ అథారిటీ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు.విశాఖ పోర్ట్ చరిత్రలో డిప్యూటీ చైర్‌పర్సన్ పదవిని చేపట్టిన తొలి మహిళా ఐఏఎస్ అధికారిణిగా ఆమె నిలిచారు.2025 జూన్ నుండి ఆగస్టు మధ్య జరిగిన ఎంపిక ప్రక్రియ అనంతరం ఈ నియామకం జరిగింది. అంతకుముందు ఈ పదవిలో దుర్గేష్ కుమార్ దూబే ఉండగా, ఆయన స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. : భారత ప్రభుత్వ పోర్ట్స్, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల మేరకు ఆమె ఈ పదవిలో నియమితులయ్యారు.ఆమె గతంలో వివిధ కీలక ప్రభుత్వ విభాగాలలో పరిపాలనాపరమైన సేవలందించారు.విశాఖపట్నం పోర్ట్ కార్యకలాపాల పర్యవేక్షణ, అభివృద్ధి ప్రాజెక్టులు మరియు పరిపాలనా నిర్వహణలో ఆమె కీలక పాత్ర పోషించనున్నారు.ప్రస్తుతం డాక్టర్ ఎం. అంగముత్తు, IAS విశాఖ పోర్ట్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి