Breaking News

పాకిస్థాన్‌ను నమ్మి మోసపోవద్దు.. బలూచ్‌ పరోక్ష హెచ్చరిక


Published on: 12 May 2025 15:37  IST

బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ పాకిస్థాన్‌ మాయ మాటలు నమ్మి మోసపోవద్దని భారత్‌కు పరోక్షంగా హెచ్చరించింది. పాకిస్థాన్‌ ఊసరవెళ్లిలా రంగులు మారుస్తుందని వ్యాఖ్యానించింది. పాకిస్థాన్‌ నుంచి వినిపించే శాంతి, కాల్పుల విరమణ, సోదరభావం ప్రవచనాలు కేవలం మోసమని పేర్కొంది. ఆ దేశంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీకి విదేశీ మద్దతు ఉందంటూ వస్తున్న విమర్శలను బలూచిస్థాన్‌ తోసిపుచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి