Breaking News

బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల నామినేషన్‌ ఫీజు 50 వేలు


Published on: 06 Jan 2026 14:31  IST

బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్‌ ఫీజును రూ.50 వేలుగా ఖరారు చేస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. నామినేషన్‌ ఫీజును ఒకేసారి రూ.30వేల నుంచి రూ.1.25 లక్షలకు పెంచడాన్ని తప్పుబట్టింది. మరోవైపు గతంలోలాగే నామినేషన్‌ ఫీజును రూ.30 వేలుగా ఉంచాలన్న పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది. అలాగే బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్‌ కల్పించేలా ఆదేశాలివ్వాలన్న అభ్యర్థనను కూడా తిరస్కరించింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement