Breaking News

సంక్రాంతికి ఊరెళ్తే.. సమాచారమివ్వండి


Published on: 09 Jan 2026 16:32  IST

సంక్రాంతి తెలుగు ప్రజల పెద్దపండుగ అని, ముఖ్యంగా ఆంధ్రకు వెళ్లేవారు కూకట్‌పల్లి, కేపీహెపీ ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటారని కూకట్‌పల్లి ఏసీపీ రవికిరణ్‌రెడ్డి అన్నారు. తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సెలవులకు ఊరు వెళ్తున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఇంట్లో విలువైన వస్తువులు, ఆభరణాలు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు కచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి