Breaking News

ముంబై పోలీసులకు బాంబు బెదిరింపు మెయిల్‌


Published on: 13 May 2025 14:23  IST

ముంబై నగరంలో రెండు రోజుల్లో భారీ పేలుళ్లు జరుగుతాయని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు మంగళవారం ఉదయం మహారాష్ట్ర పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు మెయిల్‌ పంపారు. ఈ హెచ్చరికలను తేలికగా తీసుకోవద్దని అందులో పేర్కొన్నారు. అయితే, అందులో డేట్‌, టైమ్‌, ప్లేస్‌ మెన్షన్‌ చెయ్యలేదు. ఈ బెదిరింపులతో అప్రమత్తమైన పోలీసులు  రంగంలోకి దిగి ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ మెయిల్‌ను ఎవరు పంపారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి