Breaking News

తెలంగాణ భవన్ వద్ద భారీ బందోబస్తు..


Published on: 20 Jan 2026 11:24  IST

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, హరీశ్ రావు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.ఈ నేపథ్యం లో తెలంగాణ భవన్‌లో కేటీఆర్, హరీశ్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలతో కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో పార్టీ తీసుకోవాల్సిన తదుపరి కార్యాచరణ పై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి