Breaking News

ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురి మృతి..


Published on: 20 Jan 2026 12:19  IST

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భైంసా బస్ డిపో సమీపంలో కారు- కంటైనర్ లారీ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మృతులు నిర్మల్ జిల్లా కుబేర్ మండలం కుప్టి గ్రామానికి చెందిన వారిగా తెలుస్తోంది. మృతుల్ని బాబన్న, భోజరాం పటేల్, రాజన్న, వికాస్‌గా గుర్తించారు.స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి