Breaking News

ఏడాదిన్నర తర్వాత బయటికొస్తా..!


Published on: 22 Jan 2026 11:39  IST

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రపై మరోసారి నాలుక మడతేశారు. ఈ ఏడాది జనవరి నుంచి జిల్లాల్లో పర్యటిస్తానని.. పాదయాత్ర చేపడతానని గతంలో పార్టీ కార్యనిర్వాహక సమావేశంలో ఆయన ప్రకటించారు.ఈ నెల 26వ తేదీ నుంచి ఆయన బస్సుయాత్ర చేపడతారని వైసీపీ సోషల్‌ మీడియా విస్తృత ప్రచారం కూడా చేసింది. అయితే వీటన్నిటికీ జగనే ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ఏడాదిన్నర తర్వాతే తాను బయటకు వస్తానని..అప్పుడే పాదయాత్ర ఉంటుందని ఏలూరు వైసీపీ నేతల సమావేశంలో ఆయన వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి