Breaking News

పెద్ద పులి సంచారం..ధ్రువీకరించిన అధికారులు


Published on: 22 Jan 2026 16:25  IST

బుట్టాయగూడెం మండలంలో పెద్ద పులి(Tiger) సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు. తెలంగాణ రాష్ట్రంలోని కావడిగుండ్ల ప్రాంతం నుంచి ఏలూరు జిల్లాలోకి పులి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. పందిరిమామిడి గూడెం ప్రాంతంలో పాదముద్రలను గుర్తించిన అటవీ అధికారులు.. దానిని పెద్ద పులిగా నిర్ధారించారు. అయితే.. అది వచ్చిన మార్గంలోనే వెనక్కి తిరిగి వెళ్లినట్లు పాదముద్రల ద్వారా గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి