Breaking News

ఫ్రీగా ఇస్తానంటే తీసుకోకపోవడం మూర్ఖత్వం: డొనాల్డ్‌ ట్రంప్‌


Published on: 13 May 2025 18:50  IST

కోట్ల రూపాయల ఖరీదు చేసే విమానాన్ని ఉచితంగా ఇస్తానంటే వద్దని చెప్పడం మూర్ఖత్వం అవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఖతార్‌ పాలకులు డొనాల్డ్‌ ట్రంప్‌కు విలాసవంతమైన విమానాన్ని బహుమతిగా ప్రకటించారు. ఆ బహుమతిని స్వీకరించేందుకు ట్రంప్‌ తన సమ్మతి తెలిపారు. ఈ ఖరీదైన గిఫ్ట్‌ ద్వారా ఖతార్‌ రాయల్‌ ఫ్యామిలీ ఏమైనా లబ్ధి పొందనుందా..? భద్రతాపరమైన సమస్యలు తలెత్తవా..? అనే ప్రశ్నలకు ట్రంప్‌ అలాంటివేం జరగవని జవాబిచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి