Breaking News

మారిన కేస్‌షీట్‌.. చనిపోయిన వృద్ధుడు


Published on: 22 Jan 2026 19:16  IST

కేస్‌షీట్‌ మారిపోవడంతో రోగి వాడాల్సిన మందులు వేరయ్యాయి. దీంతో లేని ఆరోగ్య సమస్య తలెత్తి వృద్ధుడు చనిపోయిన ఘటన కామారెడ్డి జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. కామారెడ్డి పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమకొండ మండలం అంచనూరుకు చెందిన వృద్ధుడు నాగ బాల్‌రాజు(73) ఈ నెల 17వ తేదీన జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో వైద్య చికిత్సల కోసం వెళ్లారు. అతడి పేరుకు దగ్గరి సంబంధమున్న పేరుతోనే మరో రోగి సైతం అదే సమయంలో ఆసుపత్రికి వచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement