Breaking News

బాసరకు పోటెత్తిన భక్తులు..


Published on: 23 Jan 2026 10:28  IST

వసంత పంచమి నేపథ్యంలో బాసరలోని జ్ఞాన సరస్వతీ దేవి ఆలయానికి శుక్రవారం భక్తులు భారీగా పోటెత్తారు. గురువారం అర్ధరాత్రి ఒంటి గంటకు అమ్మవారికి మంగళ వాయిద్య, సుప్రభాత సేవలను ఆలయ పండితులు నిర్వహించారు. ముగ్గురు అమ్మవార్లకు అభిషేక పూజలను ఆలయ అర్చకులు జరిపించారు. అనంతరం ఉదయం 3.00 గంటల నుంచి అక్షరాభ్యాసాలు ప్రారంభించారు. అమ్మవారి దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్‌లతోపాటు అక్షరాభ్యాస మండపాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement