Breaking News

లోకేష్కి రాష్ట్రవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువ

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 43వ పుట్టినరోజు సందర్భంగా నేడు (23 జనవరి 2026) రాష్ట్రవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.


Published on: 23 Jan 2026 15:44  IST

పుట్టినరోజు సందర్భంగా  లోకేష్కి రాష్ట్రవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువ . సోషల్ మీడియాలో మరియు వివిధ సేవా కార్యక్రమాల రూపంలో అభిమానులు, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

చాలా కాలం తర్వాత గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తన X (ట్విట్టర్) ఖాతా ద్వారా లోకేష్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం రాజకీయంగా మరియు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. "నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.. ఈ ఏడాది మీకు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను" అని ఆయన పోస్ట్ చేశారు.
లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి, "నువ్వే నా బలం.. నీ పక్కన నడవడం గర్వంగా ఉంది" అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. మామ, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ప్రజాసేవలో లోకేష్ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా వ్యవస్థలో లోకేష్ తీసుకొస్తున్న సంస్కరణలను కొనియాడుతూ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు అచ్చెన్నాయుడు, అనితతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు అమరావతిలో ఆయనను కలిసి అభినందనలు అందజేశారు.
మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు అన్నదానం, రక్తదాన శిబిరాలు, రోగులకు పండ్లు మరియు రొట్టెల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు.

 

Follow us on , &

ఇవీ చదవండి