Breaking News

తగ్గనున్న యూరోపియన్‌ కార్ల ధరలు!


Published on: 27 Jan 2026 10:58  IST

యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) నుంచి దిగుమతి అయ్యే కార్లపై సుంకాలను భారీగా తగ్గించేందుకు భారత్‌ సిద్ధమైనట్టు సమాచారం. యూరప్‌ నుంచి దిగుమతి అవుతున్న కార్లపై ఇండియా ప్రస్తుతం 110 శాతం సుంకాలను విధిస్తోంది. భారత్‌-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)లో భాగంగా.. 15 వేల యూరోలకు (దాదాపు రూ.16 లక్షలకు) మించి ఖరీదు ఉన్న కార్లపై ఆ సుంకాలను 110 నుంచి 40 శాతానికి (అంటే ఏకంగా 70 శాతం మేర) తగ్గించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి