Breaking News

భారత్ మరియు యూరోపియన్ యూనియన్ (EU) మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన

భారత్ మరియు యూరోపియన్ యూనియన్ (EU) మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 27, 2026న అధికారికంగా ప్రకటించారు. 


Published on: 27 Jan 2026 12:46  IST

భారత్ మరియు యూరోపియన్ యూనియన్ (EU) మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 27, 2026న అధికారికంగా ప్రకటించారు. ఈ ఒప్పందాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ "మదర్ ఆఫ్ ఆల్ డీల్స్" (అన్ని ఒప్పందాలకు తల్లి) గా అభివర్ణిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు.ఈ ఒప్పందం ప్రపంచ జీడీపీలో (GDP) 25 శాతం మరియు ప్రపంచ వాణిజ్యంలో మూడవ వంతు వాటాను కలిగి ఉన్న దేశాల మధ్య కుదిరిన అతిపెద్ద ఒప్పందం.

భారతదేశంలోని టెక్స్‌టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, లెదర్ వంటి రంగాలకు ఈ ఒప్పందం ద్వారా భారీ ప్రయోజనం చేకూరనుంది.మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సేవా రంగాలకు ఇది పెద్ద ఊతాన్ని ఇస్తుందని ప్రధాని వెల్లడించారు.సుమారు 140 కోట్ల మంది భారతీయులకు మరియు లక్షలాది మంది యూరోపియన్లకు కొత్త అవకాశాలు లభిస్తాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

2007లో ప్రారంభమైన ఈ చర్చలు దాదాపు రెండు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చాయి.ప్రస్తుతం అధికారిక చర్చలు ముగిశాయి. తదుపరి కొన్ని నెలల పాటు 'లీగల్ స్క్రబ్బింగ్' (చట్టపరమైన పరిశీలన) ప్రక్రియ జరుగుతుంది. ఈ ఒప్పందం 2027 ప్రారంభం నాటికి పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చే అవకాశం ఉంది. గోవాలో జరిగిన 'ఇండియా ఎనర్జీ వీక్ - 2026' ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధాని, వర్చువల్ విధానంలో ఈ శుభవార్తను తెలియజేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి