Breaking News

వేసిన గాలం ఎంత గుంజినా పైకి రావడంలే.. ?


Published on: 14 May 2025 11:50  IST

నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని గాంధీనగర్ ప్రాంతంలో గల శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో చేపల వేటకు స్థానికంగా ఉండే కొందరు మంగళవారం సాయంత్రం వెళ్లారు. ఈ క్రమంలో గాలం వేయగా.. చేప చిక్కినట్లు అనిపించింది. అయితే ఎంత లాగినా గాలం పైకి రావడం లేదు. దీంతో నలుగురు జతకూడి బలంగా బయటకు లాగగా.. ఏకంగా 30 కేజీల భారీ చేప చిక్కింది. అందరూ కలిసినా ఆ చేపను బయటకు లాగేందుకు అష్టకష్టాలు పడ్డారు. గాలానికి ఇంత భారీ చేప చిక్కడం చాలా అరుదని చెబుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి