Breaking News

చెన్నై బీచ్‌ నుంచి చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌


Published on: 27 Jan 2026 15:38  IST

చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ సహా మూడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి చెన్నై బీచ్‌ స్టేషన్‌ నుంచి బయల్దేరనున్నాయి. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా ఉన్నాయి... ఎగ్మూర్‌ రైల్వేస్టేషన్‌లో పునరుద్ధరణ పనుల కారణంగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేళల్లో మార్పులు చేపట్టారు. ఆ ప్రకారం, మూడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు చెన్నై బీచ్‌ నుంచి బయల్దేరనున్నాయి. చెన్నై బీచ్‌ -ముంబై సీఎస్ఎంటీ సూపర్‌ఫాస్ట్‌ రైలు ఫిబ్రవరి 4 నుంచి ఏప్రిల్‌ 4వ తేది వరకు చెన్నై బీచ్‌ నుంచి బయల్దేరనుంది. 

Follow us on , &

ఇవీ చదవండి