Breaking News

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలకు మోగిన నగారా..


Published on: 27 Jan 2026 16:09  IST

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల నగారా మోగింది. ఫిబ్రవరి 11న రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. 13వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7కార్పొరేషన్ల ఎన్నికలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే 28 నుంచి 30వ తేదీ వరకు అనగా రెండ్రోజుల పాటు ఈ ఎన్నికలకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement