Breaking News

వందే భారత్ స్లీపర్ రైళ్ల ప్రత్యేకతలు ఇవే..


Published on: 28 Jan 2026 18:21  IST

వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో 16 ఏసీ కోచ్‌లు ఉంటాయి. 823 మంది ఒకేసారి ప్రయాణించే సామర్థ్యం ఉంది. 11 ఏసీ త్రీ టైర్, 4 ఏసీ టూ టైర్, , ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లు ఉంటాయి.వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో అత్యాధునిక టాయిలెట్లు అందుబాటులో ఉంటాయి. విమానాల తరహాలోనే ఇందులో మాడ్యులర్ బయో వాక్యూమ్ టాయిలెట్లు కలిగి ఉంటాయి. ఫస్ట్ ఏసీ కోచ్‌లో ప్రయాణికుల కోసం షవర్ క్యూబికల్ ఏరియా ఉంటుంది. ఇక ఈ రైల్లో ఒక టాయిలెట్ దివ్యాంగులకు ప్రత్యేకంగా ఉంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి