Breaking News

ప్రైవేట్ స్కూల్ బస్సులో ఘోర అగ్నిప్రమాదం

అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో బుధవారం (జనవరి 28, 2026) సాయంత్రం ఒక ప్రైవేట్ స్కూల్ బస్సులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.


Published on: 29 Jan 2026 12:07  IST

అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో బుధవారం (జనవరి 28, 2026) సాయంత్రం ఒక ప్రైవేట్ స్కూల్ బస్సులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.పుట్లూరులోని శ్రీ రామ గ్లోబల్ స్కూల్‌కు చెందిన బస్సు విద్యార్థులను వారి గ్రామాలకు చేరవేస్తుండగా, చింతకుంట సమీపంలో ఇంజిన్ నుండి ఒక్కసారిగా పొగలు మరియు మంటలు చెలరేగాయి.మంటలను గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. బస్సులో ఉన్న సుమారు 30 మంది విద్యార్థులను త్వరితగతిన కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది.

విద్యార్థులు సురక్షితంగా బయటపడిన కొద్ది నిమిషాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించి, వాహనం పూర్తిగా దగ్ధమై అస్థిపంజరంలా మారింది.ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సులో సంభవించిన షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement