Breaking News

విశాఖకు ఆర్‌ఎంజడ్‌ బృందం


Published on: 29 Jan 2026 11:57  IST

బెంగళూరుకు చెందిన ఆర్‌ఎంజడ్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులు విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఐటీ సంబంధిత పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూముల ను బుధవారం పరిశీలించారు. రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌, విశాఖ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి, ఏపీఐఐసీ అధికారులు వారికి భూములు చూపించారు. రాబోయే ఐదారేళ్లలో ఏపీలో రూ.83 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని ఇటీవల దావోస్‌లో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో ఆర్‌ఎంజడ్‌ గ్రూపు ఒప్పందం చేసుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి