Breaking News

మళ్లీ మెరిసిన కియ


Published on: 29 Jan 2026 12:41  IST

కార్ల ఉత్పత్తిలో దూసుకెళ్తూ.. మరోవైపు ప్లాంట్‌లో సానుకూల పని వాతావరణాన్ని కల్పిస్తున్న కియ కార్ల తయారీ సంస్థ వరుసగా రెండో ఏడాదీ ‘గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌’ సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం యర్రమంచి సమీపంలో ఏర్పాటైన కియ కార్ల తయారీ పరిశ్రమ.. ఈ ఏడాది కూడా ఈ సర్టిఫికెట్‌ను అందుకున్నట్టు కియ ఇండియా సీఈవో గ్వాంగ్‌ లీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దేశంలో ప్రముఖ మాస్‌ ప్రీమియం కార్ల తయారీ సంస్థల్లో కియ ఇండియా ఒకటి.

Follow us on , &

ఇవీ చదవండి