Breaking News

SBI రిక్రూట్‌మెంట్ 2026: 2200 పైగా ఖాళీ పోస్టులు.. అర్హతలు, వివరాలు ఇవే..

SBI రిక్రూట్‌మెంట్ 2026: 2200 పైగా ఖాళీ పోస్టులు.. అర్హతలు, వివరాలు ఇవే..


Published on: 31 Jan 2026 18:07  IST

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.

ఖాళీలు: 2273 (సర్కిల్ బేస్డ్ ఆఫీసర్). హైదరాబాద్ పరిధిలో 80 ఖాళీలు ఉన్నాయి. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సమానమైన అర్హత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 21 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జనవరి 29.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. 

లాస్ట్ డేట్: ఫిబ్రవరి 18. 

సెలెక్షన్ ప్రాసెస్: ఆన్​లైన్ ఎగ్జామినేషన్, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు sbi.bank.in/web/careers/current-openings వెబ్​సైట్​ను సందర్శించండి. 

Follow us on , &

ఇవీ చదవండి